A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటా-జగన్
Share |
October 22 2017, 3:42 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక నంద్యాలను తన గుండెలలో పెట్టుకుని చూసుకుంటానని విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. తమ నియోజకవర్గం అయిన పులివెందుల తర్వాత అంత గొప్పగా నంద్యాలను అబివృద్ది చేస్తామని ఆయన ప్రకటించారు.నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.మూడు ఏళ్లుగా నంద్యాలను పట్టించుకోకుండా, ఏ సమాజికవర్గాన్ని పట్టించుకోకుండా,ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కనుక ఇప్పుడు ఏదో చేస్తున్నామని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘మోసం చేసేవారిని ప్రజలు వదిలిపెట్టరు...కాలర్‌ పట్టుకుంటారనే పరిస్థితి రావాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో న్యాయం, ధర్మం రావాలి. నంద్యాలలో మీరు వేసే ఈ ఓటుతో రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మారుతుంది. నవరత్నాలు తెచ్చుకునే మనందరి పరిపాలనకు నాంది, బీజం నంద్యాల నుంచే పడుతుంది. నంద్యాలలో ఏ ఒక్కరికీ నష్టం జరగదని హామీనిస్తున్నా. మీరు వేసే ఈ ఓటు మర్చిపోను. పులివెందుల తర్వాత అంత గొప్పగా నంద్యాలను అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నా’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

tags : jagan,nandhyala

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info