A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అహ్మద్ పటేల్ ను వీరు రక్షించారు
Share |
October 22 2017, 3:42 pm

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వాదన గుజరాత్ లో ఆ పార్టీ నేత అహ్మద్ పటేల్ కు విజయం తెచ్చి పెట్టిందట. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపి పోలింగ్ ఏజెంట్ కు బాలెట్ ను చూపించారు. వారు నిజానికి కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ కు మాత్రమే బ్యాలెట్ ను చూపించవలసి ఉంది.కాని వారిద్దరూ కాంగ్రెస్ కు కాకుండా బిజెపికి ఓటు వేయడంతో ఆ పనిచేశారు. దానిపై కాంగ్రెస్ అభ్యర్ధి అహ్మద్ పటేల్ అభ్యంతరం చెప్పారు.కాని ఎన్నికల రిటర్నింగ్ అదికారి పట్టించుకోలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ అదికార ప్రతినిది రణదీప్ సూర్జేవాలకు ఈ విషయం చెప్పి వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే సూర్జేవాలకు కూడా ఈ అనుభవం ఉంది. గతంలో ఆయన హర్యాన ఎమ్మెల్యేగా ఉండేవారు.ఆయన రాజ్యసభ ఎన్నికలలో పోలింగ్ ఏజెంట్ కు కాకుండా, సిఎల్పి నేతకు బాలెట్ పత్రాన్ని చూపించారట.దాంతో ఆ ఓటు చెల్లదని అదికారులు ప్రకటించారు. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ అదికారులకు వివరించారు.ఆ తర్వాత ఆయన కమిషన్ నుంచి బయటకు వచ్చేశారు.అదే సమయంలో కేంద్ర మంత్రులు కొందరు బిజెపి తరపున ఒత్తిడి తేవడానికి ఎన్నికల సంఘానికి వెళ్లారు. అదే సమయంలో సోనియాగాందీతో సమావేశంలో ఉన్న చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ లు కూడా ఈ విషయం తెలుసుకుని ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. అక్కడ చిదంబరం చట్టంలోని వివిధ అంశాలను సమర్ధంగా వినిపించడంతో ఎన్నికల సంఘం కాంగ్రెస్ వాదనతో ఏకీభవించిందట.కాంగ్రెస్ నుంచి అదనంగా ఇద్దరు పిరాయించినా, ఎన్సిపి సభ్యుడి ఓటు కూడా పటేల్ కు కలిసి వచ్చింది.

tags : congress,ahmad patel, protection

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info