A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నోట్ల రద్దు నో అనేవాడిని- ఆర్బిఐ మాజీ గవర్నర్
Share |
December 13 2017, 3:11 am

తాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉండి ఉన్నట్లయితే వెయ్యి,ఐదువందల రూపాయల నోట్ల రద్దు ప్రతిపాదనను ఆమోదించేవాడిని కానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమన్ జలాల్ వ్యాఖ్యానించారు.దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. నోట్ల రద్దు వల్ల కొన్ని సానుకూలతలు ఉన్నా, ప్రతికూలతలు మరీ ఎక్కువగా కనిపించాయని ఆయన అబిప్రాయపడ్డారు. రూపాయిపై రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ ఉంటుందని, అలాంటి దానిని రద్దు చేయడం సరికాదని, ఏదైనా సంక్షోభం వస్తే తప్ప అని ఆయన అన్నారు. ఇప్పుడు అలాంటి సంక్షేభం ఏమీ లేదని ఆయన అన్నారు. నల్లధనం నిర్మూలనకు ఇది మార్గం కాదని ఆయన స్పష్టం చేశారు. నల్లధనం ఎక్కడ తయారవుతుందో కనిపెట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. పన్ను రేట్లు అదికంగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చన్నారు. ఆదాయపన్ను రేట్లు, జిఎస్టిలను ప్రతి సంవత్సరం మార్చకుండా ఉంటే బెటర్ అని ఆయన సూచించారు.

tags : rbi,notes,demonitisation, jalal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info