A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాల ఓటర్లను బెదిరించడానికి టీమ్ లు
Share |
February 25 2018, 5:12 am

నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహానికి తెరదీసింది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేస్తారన్న అనుమానం ఉన్నవారి ఇళ్లకు వెళ్లి వారిని నయానో,బయానో దారిలోకి తీసుకు రావడానికి వీలుగా ప్రత్యేక టీమ్ లను నియమించిందని సమాచారం. ఇతర జిల్లాల నుంచి కాలేజీల విద్యార్దులు కొందరికి డబ్బు ఇచ్చి ఈ పనికి నియమించారు. వారు నంద్యాలలో కేటాయించిన ప్రాంతాలలో తిరుగుతూ ఓటర్ల ఇళ్లకు వెళ్లి టిడిపికి కాకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస కు ఓటు వేస్తే మీకు వచ్చే పించన్, ఇతర సదుపాయాలు కట్ అవుతాయని బెదిరిస్తున్నారు. వారి వద్ద ఓటర్ల జాబితాల వారిగా పేర్లు ఉండడమే కాకుండా, వారికి వచ్చే సదుపాయాల వివరాలు కూడా ఉండడం గమనార్హం. ఇలాంటి ఇద్దరు యువకులను వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు బుడ్డా శేషారెడ్డి తదితరులకు స్థానికులు అప్పగించారు. టిడిపి కి ఓటు వేయకపోతే పెన్షన్ రాదని, డ్వాక్రా రుణం రాదని వీరు బెదిరించారని కొందరు మహిళలు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చామని ఆ ఇద్దరు యువకులు చెప్పారు. తాము చేస్తున్నది తప్పేనని ఆ యువకులు ఇద్దరు ఒప్పుకోవడం విశేషం.

tags : nandhyala, voters, threats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info