A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోదండరామ్ యాత్రకు బ్రేక్ -అరెస్టు
Share |
July 23 2018, 6:00 am

తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ యాత్ర కు కొందరు అడ్డుపడడం, పోలీసులు కోదండరామ్ ను అరెస్టు చేయడం వంటి ఘటనలతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.దీంతో కోదండరామ్ చేపట్టిన అమరవీరుల స్పూర్తి యాత్ర గందరగోళంగా మారింది.తొలుత కామారెడ్డి జిల్లా బసవాపూర్ వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు కోదండరామ్ ను అడ్డుకునే యత్నం చేశారు. ఇరు వర్గా మధ్య తోపులాట జరిగింది. దాంతో పోలీసులు కోదండరామ్ ను అదుపులోకి తీసుకుని బిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.కాగా కామారెడ్డి జెఎసి సభ వేదిక వద్ద కూడా ఇలాగే గొడవ జరిగింది.ఇరువర్గాల మద్య ఘర్షణ జరిగింది.పోలీసులు జెఎసి కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

tags : kodandram, jac

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info