A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు ఉరి శిక్ష వేసినా...
Share |
October 22 2017, 3:42 pm

ఎపి విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి చేసిన ప్రసంగంపై టిడిపి అభ్యంతరం చెబుతోంది.చంద్రబాబు చేసిన మోసాలకు ఉరి శిక్ష వేసినా తప్పు లేదని అంటామని ఆయన అన్నారు.దీనిపై టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డిలు జగన్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. దారుణంగా జగన్ ప్రసంగిస్తున్నారని వారు విమర్శించారు. కాగా జగన్ ప్రసంగం ఇలా ఉంది..

అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి... అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న చంద్రబాబును కచ్చితంగా ప్రశ్నిస్తామని, నిలదీస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మైకు పట్టుకుని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని చంద్రబాబును నిలదీస్తూనే ఉంటామని....ఇలాంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష వేయాలని జగన్‌ ప్రశ్నించారు. ‘అయ్యా చంద్రబాబు తప్పుచేశావు.... నిన్ను ప్రశ్నిస్తాం.... తప్పుచేసిన నిన్ను నిలదీస్తాం’ అని పేర్కొన్నారు. నీ నేరాలకు, నీ మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అని చెబుతూ ఉంటామన్నారు. అన్యాయాలు, మోసాలు చేసే వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు అని గట్టిగా అంటూనే ఉంటామని తేల్చిచెప్పారు.

tags : jagan, chandrababu, hang

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info