A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అంతా నంద్యాలపేనే .. కరవును వదలివేశారా
Share |
July 23 2018, 6:01 am

తెలుగు రాష్ట్రాలలో గత నెల రోజులుగా వర్షాలు లేని పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.(రెండు రోజులుగా అక్కడక్కడా వర్షం పడుతుండడం కాస్త ఊరట కలిగించదే అయినా ) కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు అడుగంటిపోయిన వైనం కలవరపెడుతోంది. జూరాలకు కర్నాటక నుంచి నీరు వస్తాయని ఆశిస్తే ,అవి ఆగిపోయాయి. దీనిపై రెండు ప్రభుత్వాలు దృస్టి సారించవలసిన సమయం ఆసన్నమైంది.జూన్ మొదటిలో వర్షాలు కాస్త బాగానే పడడంతో రెండు రాస్ట్రాలలో ఆయా పైర్లు వేసుకున్నారు. కాని తీరా మొక్క మొలిసే సమయానికి వరుణుడు మొహం చాటేసినట్లు వ్యవహరిస్తున్నాడు. దీంతో రెండు రాష్ట్రాలలో లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. కొన్ని లక్షల ఎకరాలలో ఇంకా నాట్లే పడలేదు. ఎపిలో రాయలసీమ ప్రాంతంలో అయితే ఇది తీవ్రంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రబుత్వానికి నంద్యాల ఉప ఎన్నికపై ఉన్నంత శ్రద్ద , అక్కడ ఏదో విధంగా గెలవాలన్న తాపత్రయం కరువు ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి లేదన్న విమర్శలు వస్తున్నాయి.నంద్యాలలో దాదాపు పది మంది మంత్రులు తిష్ట వేయడం, మిగిలిన మంత్రులు,తరచు వచ్చి వెళ్లడం వంటివి చేస్తున్నారు.ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబే నంద్యాలకు రెండుసార్లు వెళ్లి చిన్న,చితక నేతలను కూడా ఆకట్టుకోవడానికి ఎన్ని తంటాలు పడింది చూశాం. అదే కర్నూలు జిల్లాలో సైతం పంటలు ఎండిపోతున్నాయి. మెట్ట ప్రాంతాలలో వేసిన కంది,వేరుశనగ,తదితర పంటలు మొక్కదశలోనే వాడిపోతున్నాయని రైతులంతా కలవరపడుతున్నారు.ఇక అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే ఒక పత్రికలో అనంతపురంలో పంటలు ఎండిపోయే స్థితి ఏర్పడిందని వివిధ చెరువలలో ఇరవై ఏడు టి.ఎమ్.సిలకు గాను 1.1 టి.ఎమ్.సి నీరే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. తక్షణమే పొలాలకు తడులు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ సందర్భంలోనే ఒక విషయం వెల్లడైంది. టిడిపి మీడియాలో గత ఏడాది రెయిన్ గన్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు పంటలను కాపాడినట్లు ప్రచారం జరిగింది. అదే మీడియా ఈసారి ఏమి రాసిందో తెలుసా! కిందటి ఏడాది జలఫిరంగులు(రెయిన్ గన్ లు) ఉపయోగించినా.. వేరుసెనగ పంట వేరు నుంచి ఎండిపోవడంతో ప్రయత్నం ఫలించలేదని ఆ మీడియా వెల్లడించింది.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ ఏడాది పంట ఎండిపోకముందే గుర్తించి నీరు అందించాలని ముఖ్యమంత్రి తొలి నుంచి చెబుతూ వస్తున్నారట. మరి చంద్రబాబు చెప్పారో లేదో తెలియదు కాని, ఆయా చోట్ల పంటలు మాత్రం ఎండిపోతున్నాయి.పైగా కొన్ని చోట్ల రెయిన్ గన్ ల వాడకానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదని అదికారులు చెబుతున్నారని కొందరు రైతులు చెబుతున్నారు.ఎండిపోతున్న పంటలను ఆదుకోవడానికి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టడం లేదు. కాని నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్నందున హడావుడిగా వందల కోట్ల రూపాయలను అక్కడ వెచ్చించే యత్నం చేసింది. సడన్ గా నంద్యాల అబివృద్ది గుర్తుకు వచ్చింది. ఆకస్మికంగా అక్కడ పదమూడువేల ఇళ్లను నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. ఈ ఉప ఎన్నిక అయ్యేవరకు చంద్రబాబు ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న రైతులను మాత్రం పట్టించుకోదా అని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.వర్షాల కోసం ప్రజలు పూజలు,యాగాలనే నమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.తెలంగాణలో సైతం పలు జిల్లాలలో దాదాపు ముప్పై లక్షల ఎకరాలకు నీటి ఎద్దడి ఏర్పడుతోందని మీడియాలో ప్రధాన కధనాలుగా వస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఇక్కడ అత్యవసర సమావేశం పెట్టి ఈ పరిస్తితిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు.ఏది ఏమైనా రెండు రాష్ట్రాలలో కరువు సమస్యపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. గత నాలుగేళ్లుగా ఈ దుర్బిక్ష వాతావరణం కొనసాగుతుండడంతో రైతుల జీవితాలను అల్లకల్లోలం అవుతున్నాయి. మరి రైతులను ఆదుకుంటారా?ఎన్నికల రాజకీయాలే జరుపుతారా!

tags : ap,draught

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info