A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిఎస్టి,స్వాతంత్ర దినం ఒకటేనా
Share |
May 23 2018, 2:24 pm

స్వాతంత్ర దినోత్సవం రావడం, జిఎస్టి అమలు చేయడం ఒకటిగానే భావిస్తున్నట్లుగా ఉంది కేంద్ర ప్రభుత్వం . కొత్తగా ఒకే దేశం-ఒకే పన్ను పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేయనున్న జిఎస్టి ని ప్రతిష్టాత్మక రీతిలో జూన్ ముప్పైన అర్దరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రారంబించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది.స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ 1947 ఆగస్టు పదిహేను అర్దరాత్రి ట్రిస్ట్ విత్ డెస్టిని పేరుతో పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉత్సవం నిర్వహించారు.ఆ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైనదిగా ప్రసిద్దిగాంచింది.ఆ తరహాలోనే జిఎస్టిని ప్రారంభించాలని నిర్ణయించారని, ప్రదాని మోడీ ప్రసంగిస్తారని చెబుతున్నారు.జూన్‌ 30 రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం.. అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జీఎస్టీ అమలును ప్రకటిస్తారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇందుకు ఆహ్వానించారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు కూడా హాజరు అవుతారు.

tags : central government, gst,indipendence day

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info