A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిల్లాలలో వంద అడుగుల జాతీయ జెండాలు
Share |
October 24 2017, 1:22 pm

తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో భారీ జెండాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్ కాకుండా మిగిలిన ముప్పై జిల్లాలలో కూడా 100 అడుగుల ఎత్తు ఉండే జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ లకు సూచనలు చేశారని కధనం.దీని ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలోను రెండు ఎకరాల విస్తీర్ణంలో జాతీయ జెండాను ఏర్పాటు చేస్తారు.ఇందుకోసం జిల్లాకు ఏబై లక్షల రూపాయల చొప్పున నిదులు ఇస్తారు. మొత్తం పదిహేను కోట్లను ఇందుకు కేటాయిస్తారు.ఈ జెండా ప్రదేశాన్ని టూరిస్టు స్పాట్ లుగా అబివృద్ది చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంజీవయ్య పార్కు వద్ద 291 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.అయితే ఈ జెండాను నిర్వహించడం కష్టం గా ఉంది. ఈ విషయం లో ఒక స్పష్టత వస్తే అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.

tags : telangana, national flags

Latest News
*టీడీపీ సర్వీస్ అధికారిగా సీనియర్ ఐఏఎస్!
*మరి చంద్రబాబుపై కేసు పెట్టలేదే-వైసిపి
*తెలంగాణ త్రిముఖ పోటీలు ఉంటే..కెసిఆర్ ఆలోచన
*చంద్రబాబు చేతులు ఎత్తివేసినట్లేనా
*లైంగిక వేదింపుల్లో మరో ప్రముఖ దర్శకుడు
*ఎపిలో నిరుద్యోగులు పది లక్షల మందేనా
*ఎపి సి.ఎమ్.ఓపై హైకోర్టుకు వెళ్లిన ఐవైఆర్
*రూఫ్ టాప్ లపై కూరగాయలు- శిక్షణ ఇస్తారు
*పిహెచ్ సిలకు హార్వర్డ్ సాంకేతిక శిక్షణ
*గడ్కరితో సమావేశానికి హరీష్ రావు
*తెలంగాణలో టిడిపి కి మంత్రి పదవులు!
*టీడీపీ సర్వీస్ అధికారిగా సీనియర్ ఐఏఎస్!
*25 లక్షల మంది కాంగ్రెస్ లో చేరాలన్నారట
*బిజెపి వద్ద అపరిమిత డబ్బు-శివసేన
*నోట్ల రద్దు కు ఏడాది-విపక్ష ర్యాలీ సన్నాహాలు
*ఎపికి కృష్ణా జలాలు 270 టి.ఎమ్.సిలు కావాలి
*జగన్ పాదయాత్ర తేదీ నవంబర్ ఆరు
*జాతీయ గీతం-జడ్జిలను బట్టి నిర్ణయాలు మారతాయి
*రచయితల చిరునామాలు పంపించండి
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మైనార్టీలకు పది శాతం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info