A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిఎస్టి- జమ్ము-కశ్మీర్ లో రాజకీయ వివాదం
Share |
June 27 2017, 12:28 pm

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు గూడ్స్ ,సర్వీస్ టాక్స్ (జిఎస్టి) కి సన్నద్దం అవుతుండగా జమ్ము-కశ్మీర్ మాత్రం వెనుకాడుతున్నట్లు సమాచారం. దీనికి రాజకీయ కారణాలు ఆపాదిస్తున్నారు.జిఎస్టి ని పశ్చిమబెంగాల్, తమళనాడు,పంజాబ్ వంటి రాష్ట్రాలు వ్యతిరేకించినా, ప్రధాని మోడీ చొరవతో ఆ రాష్ట్రాలు మరికొద్ది రోజులలో దీనిపై తీర్మానాలు చేయవచ్చని భావిస్తున్నారు.కాని కశ్మీర్ లో పిడిపి-బిజెపి ప్రభుత్వం ఉన్నా,దీనిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయట.జిఎస్టి అమలులోకి వస్తే ఇంతకాలం జమ్ము-కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి అనండి స్వతంత్ర ప్రతిపత్తి అనండి ..దెబ్బతింటుందని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రచారం చేస్తోంది.దీంతో అదికార కూటమి ఇబ్బంది పడుతోంది.జిఎస్టిని ఆమోదిస్తే కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న హోదా దెబ్బతిందని ప్రజలు భావిస్తే రాజకీయంగా నష్టం అవుతుందని అదికార పక్షం భయపడుతోంది. ఈ నేపధ్యంలో జిఎస్టికి జమ్ము-కశ్మీర్ రాష్ట్రం ఒక ముల్లుగా మారిందని విశ్లేషణలు వస్తున్నాయి.

tags : gst, kashmir

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info