A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో వైసిపి ధర్నాకు పోటీగా టిడిపి సంకల్పం
Share |
October 24 2017, 1:22 pm

విశాఖపట్నంలో ఈ నెల ఇరవై రెండున వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాకు పోటీగా తెలుగుదేశం పార్టీ మహా సంకల్పం పేరుతో ఒక కార్యక్రమం చేపడుతోంది.దీనితో విశాఖలో ఈ రెండు కార్యక్రమాలు ఏలా జరుగతాయన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.మహా సంకల్పం నిర్వహించడానికి ఇదే సరైన సమయం అని తమ పార్టీ భావిస్తోందని ఎమ్మెల్యే గణేష్ అన్నారు.విశాఖ లో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని,టిడిపి నేతలు భూములు కబ్జా చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.దీనివల్ల తమ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని భావించిన టిడిపి పోటీగా ఈ సంకల్పం చేపట్టి వైఎస్ ఆర్ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.కాగా దీనిపై వైసిపి నేతలు మండిపడుతున్నారు.భూమి కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే టిడిపి నేతలు ఈ ప్రయత్నం చేస్తున్నారని వైసిపి నేత గుడివాడ అమర్ నాద్ అన్నారు. వైసిపి అదినేత జగన్ మహాధర్నాలో పాల్గొంటున్నారు.కొంతకాలం క్రితం ప్రత్యేక హోదాపై కాండిల్ ర్యాలీ తీయడానికి జగన్ విశాఖ రాగా,ఆయనను విమానాశ్రయంలోనే అరెస్టు చేసి హైదరాబాద్ పంపించేశారు. ఈసారి కూడా అలాంటి కుట్ర ఏమైనా జరుగుతోందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

tags : vsp,tdp,ycp

Latest News
*టీడీపీ సర్వీస్ అధికారిగా సీనియర్ ఐఏఎస్!
*మరి చంద్రబాబుపై కేసు పెట్టలేదే-వైసిపి
*తెలంగాణ త్రిముఖ పోటీలు ఉంటే..కెసిఆర్ ఆలోచన
*చంద్రబాబు చేతులు ఎత్తివేసినట్లేనా
*లైంగిక వేదింపుల్లో మరో ప్రముఖ దర్శకుడు
*ఎపిలో నిరుద్యోగులు పది లక్షల మందేనా
*ఎపి సి.ఎమ్.ఓపై హైకోర్టుకు వెళ్లిన ఐవైఆర్
*రూఫ్ టాప్ లపై కూరగాయలు- శిక్షణ ఇస్తారు
*పిహెచ్ సిలకు హార్వర్డ్ సాంకేతిక శిక్షణ
*గడ్కరితో సమావేశానికి హరీష్ రావు
*తెలంగాణలో టిడిపి కి మంత్రి పదవులు!
*టీడీపీ సర్వీస్ అధికారిగా సీనియర్ ఐఏఎస్!
*25 లక్షల మంది కాంగ్రెస్ లో చేరాలన్నారట
*బిజెపి వద్ద అపరిమిత డబ్బు-శివసేన
*నోట్ల రద్దు కు ఏడాది-విపక్ష ర్యాలీ సన్నాహాలు
*ఎపికి కృష్ణా జలాలు 270 టి.ఎమ్.సిలు కావాలి
*జగన్ పాదయాత్ర తేదీ నవంబర్ ఆరు
*జాతీయ గీతం-జడ్జిలను బట్టి నిర్ణయాలు మారతాయి
*రచయితల చిరునామాలు పంపించండి
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మైనార్టీలకు పది శాతం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info