A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మద్యం షాపులను రక్షించే పనిలో ఎపి ప్రభుత్వం
Share |
June 27 2017, 12:28 pm

ఎపి ప్రభుత్వం ఇప్పుడు మద్యం షాపులను రక్షించే పనిలో పడిందని ఒక ఆంగ్ల పత్రిక కదనం ఇచ్చింది.సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం మద్యం విక్రయాలపై లభిస్తోంది.ప్రస్తుతం 3183 మద్యం ఫాపులు750 పైగా బార్ లు ఉన్నాయి. వీటిలో అరవై శాతం జాతీయ రహదారుల వెంబడి ఉన్నాయని అంచనా. సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు ఉన్న మద్యం షాపులను మూసివేయాలి. అలా చేస్తే అరవై శాతం షాపులు లైసెన్స్ లు కోల్పోతాయి. దానివల్ల ఆదాయం పోవడమే కాకుండా,ఇతర సమస్యలు కూడా వస్తాయని ప్రభుత్వం బావిస్తోంది.దీనికి విరుగుడుగా, ఆయా నగరాలు,పట్టణాలలోని జాతీయ రహదార్లను డీ నోటిఫై చేయడం ద్వారా ఈ సమస్యను అదిగమించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.అలాచేస్తే ముప్పై శాతంషాపులు ఈ ఇబ్బంది నుంచి బయటపడతాయని అంటున్నారు.ఈ నేపధ్యంలో జాతీయరహదారుల నుంచి మినహాయింపు అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు అదికారులు చెప్పారు.

tags : ap, liquor shops

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info