A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రపతి గా ఆర్ఎస్ఎస్ వ్యక్తా-వామపక్షాలు నో
Share |
September 21 2017, 5:00 am

రాష్ట్రపతి పదవికి బిజెపి ఎంపిక చేసిన అభ్యర్ధి బీహారు గవర్నర్ రామ్ నాద్ కోవిద్ పట్ల వామపక్్సాలు వ్యతిరేకత తెలుపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్ధిగా చేస్తారా అని సిపిఎం ప్రశ్నించింది.కాంగ్రెస్ పార్టీ రామ్ నాద్ కోవిద్ అభ్యర్ధిత్వంపై ఆలోచించి చెబుతామని ప్రకటించగా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగవచ్చన్న సంకేతం ఇచ్చారు. రామ్ నాద్ ను రాజకీయేతరుడుగా చూడలేమని, ఆయన ఆర్ఎస్ఎస్ దళిత శాఖకు నాయకుడని ఏచూరి అన్నారు.ఇది పూర్తి గా రాజకీయ సంఘర్షణ అని ఆయన అన్నారు.కోవిద్ ను మతసంస్థ ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి అని సిపిఎం అభిప్రాయపడింది.కాగా సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా కోవిద్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారు.ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి కి మద్దతు ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు.

tags : presiden, ramnath kovid, left no

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info