A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెయిల్ కుంభకోణం- 10కోట్లు చేతులు మారాయి
Share |
August 17 2017, 1:16 pm

గతంలో ఉమ్మడి ఎపిలో బెయిల్ కుంభకోణం తీవ్ర కలకలం రేపింది.అలాంటి ఘటనే ఈసారి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి ఒక మానభంగం కేసులో అరెస్టు అయ్యాడు. ఆయనకు అతి కొద్ది రోజులలోనే బెయిల్ వచ్చిన తీరు అందరిని విస్మయపరిచింది. కాని పైకోర్టుఈ బెయిల్ ను రద్దు చేయడమే కాకుండా, బెయిల్ ఇచ్చిన తీరుపై విచారణ జరపాలని హైకోర్టు చీప్ జస్టిస్ దిలీప్ భోసలే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఒక నివేదిక తయారు చేశారు.దాని ప్రకారం ప్రజాపతికి బెయిల్ తెప్పించడం కోసం పది కోట్లు చేతులు మారాయని వెల్లడైంది.ఈ కేసును చేపట్టిన ముగ్గురు న్యాయవాదులు ఐదు కోట్లు పంచుకోగా, మిగిలిన మొత్తం ఇద్దరు జడ్జిలకు ముట్టిందన్నది అభియోగంగా ఉంది. గత ఏడాది నుంచి ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీకాంత్ అనే జడ్జిపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా, ఆయనను బదిలీ చేసి, మూడు వారాలలో రిటైర్ అయ్యే మిశ్ర అనే జడ్జిని నియమించారు. అందుకు బాద్యుడైన జడ్జి రాజేంద్ర సింగ్ పై కూడా ఇప్పుడు అబియోగాలు వచ్చాయి.ఈయనను తొలుత హైకోర్టు జడ్జిల ప్రమోషన్ పానెల్ లో పెట్టినా, ఆ తర్వాత ఈ కేసు రీత్యా ఉపసంహరించుకున్నారు.

tags : justice, bail, scam

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info