A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ అలా స్పందిస్తారా!
Share |
May 23 2018, 6:39 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసక్తికరమైన విషయమే చెప్పారు. ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ లపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని ఆయన అంటున్నారు. తాను మోడీతో ఈ విషయమై ప్రత్యేకంగా మాట్లాడానని, ఇది తమ ఎన్నికల హామీ అని చెప్పానని, తీర్మానాన్ని పంపాలని మోడీ సూచించారని కెసిఆర్ అన్నారు.దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని ఆయన అన్నారు. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే పోరాటం చేస్తాం తప్ప వెనుకడుగు వేసేది లేదని ఆయన అంటున్నారు.ఇప్తార్ విందు సందర్భంగా కెసిఆర్ ఈ విషయాలు చెప్పారు. మైనార్టీలకు తాను చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.మతపరమైన రిజర్వేషన్ లుగా బిజెపి తెలంగాణ నేతలు విమర్శిస్తున్న తరుణంలో మోడీ నిజంగానే సానుకూలంగా స్పందిస్తారా ?అన్నది సందేహమే.

tags : kcr, modi, reaction

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info