A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చీప్ ట్రిక్స్ పీక్ కు వెళ్లాయంటూ..విశ్లేషణ
Share |
April 26 2018, 3:21 pm

చంద్రబాబు చీప్ ట్రిక్స్ పీక్ కు వెళ్లాయంటూ తెలుగుగేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ రాసిన విశ్లేషణ ఇది.ఆసక్తికరంగా ఉంది.చదవండి.
.......................................

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చీప్ ట్రిక్స్ పీక్ కు వెళ్ళాయి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచటానికి ఆయన మనవడిని చూడటానికి హైదరాబాద్ కూడా వెళ్లటం లేదట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్ష్యాత్తూ ఆయన సీఆర్ డీఏ సమావేశంలో చెప్పటం. దాన్ని సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటన రూపంలో ఇవ్వటం లేదు. ఇది చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు సీఎం మనవడికి..అమరావతి బ్రాండ్ కు సంబంధం ఏమిటి అని?. సీఆర్ డీఏ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు..సీఎం కార్యాలయం పంపిన ప్రెస్ నోట్ పాయింట్లు ఏమిటో మీరే చూడండి. ‘శని, ఆదివారాల్లో సైతం తాను మనవణ్ణి చూడ్డానికి హైదరాబాద్ పోకుండా అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే వుంటున్నానని, పెరుగుతున్న అమరావతి బ్రాండ్‌కు అనుగుణంగా వెంటనే 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు వస్తే అంతర్జాతీయంగా రాకపోకలు పెరుగుతాయని చెప్పారు. సోషల్, హాస్పిటాలిటీ కార్యకలాపాలు పెరిగిన నాడే అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అన్నారు.’ ఇదీ ఆ ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కష్టపడుతున్నారనే అనుకుందాం. ఓ రెండు రోజుల పాటు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి ఆయన మనవడిని చూసి వస్తే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందా?. అసలు ఇంకా మొదలే కానీ అమరావతి నిర్మాణ పనులు ఆగిపోతాయా?. లేక ఆయనే దగ్గరుండి బిల్డింగ్ లు కట్టిస్తారా?. అసలు ఆయన మనవడిని చూడటానికి …అమరావతికి సంబంధం ఏంటి? వారం వారం సీఆర్ డీఏ సమావేశాలు పెట్టడం తప్ప..మూడేళ్లు పూర్తయినా కనీసం డిజైన్లను ఖరారు చేయించటంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇవన్నీ వదిలేసి ఈ చీప్ ట్రిక్స్ తో ప్రజల మెప్పు పొందగలరా?. అసలు అధికారిక సమీక్షలో మనవడి అంశం ప్రస్తావన ఎందుకు?.. పైగా అది మళ్లీ ప్రెస్ నోట్ లో పెట్టడం. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల్లోనే చంద్రబాబు సర్కారు చక్కదనం కన్పించింది. సొంత పార్టీకి చెందిన నేతలే వీటిపై విమర్శలు గుప్పించారు.(అదే సమయంలో ఆయా నేతల పెళ్లిళ్లో, ఇతర కార్యక్రమాలకు చంద్రబాబు హైదరాబాద్ వస్తున్న సంగతి కూడా గమనించవలసిందే)

tags : telugu gateway, chandrababu, cheap trics

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info