A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్న తండ్రే విషం పెట్టాడు..దారుణం
Share |
December 13 2017, 3:20 am

కుటుంబ బాందవ్యాలు బలహీనంగా మారుతుండడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.కన్న తండ్రే వారి పాలిట యముడు అయ్యాడు. ఇంటిలో ఏవో మనస్పర్దలు వచ్చాయని , ఆ తండ్రి తన భార్య,బిడ్డలకు విషం ఇచ్చాడు. తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.విజయవాడ కృష్ణ లంక లోని రణధీర్ నగర్ లో ఈ విషాదం జరిగింది.సురేష్ అనే ఇరవైతొమ్మిదేళ్ల వ్యక్తి, యశోద అనే ఇరవైఎనిమిదేళ్ల ఆమె భార్యాభర్తలు.వారిద్దరూ కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు.శనివారం అర్ధరాత్రి వారి కుమారుడు అమీర్ పుట్టిన రోజుకూడా జరిపారు. ఆ తర్వాత ఏమైందో సురేష్ తన భార్య,పిల్లలకు విషం కలిపిన ఆహారం ఇచ్చి, తాను కూడా తీసుకున్నాడు.ఫలితంగా సురేష్,యశోద, అమీర్ లు మరణించగా, ఇద్దరు కుమార్తెల పరిస్థితి విషమయంగా ఉంది.స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకూడదు.

tags : father, killed, poison, three dead

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});