A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి దివాకరరెడ్డి ఎలా సేఫ్ అవుతారంటే...
Share |
June 19 2018, 12:22 pm

అనంతపురం ఎమ్.పి జెసి దివాకరరెడ్డిపై చర్య తీసుకునే దైర్యం ఎందుకు చంద్రబాబు తీసుకోరన్నదానిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కధనాన్ని ఇచ్చింది.విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమాన సంస్థ సిబ్బంది తో అనుచితంగా జెసి వ్యవహరించిన సంగతి తెలిసిందే. జెసిపై దేశీయ విమాన సంస్థలన్నీ నిషేధం విధించాయి. అయినా చంద్రబాబు ఏదో మాట వరసకు అసంతృప్తి వ్యక్తం చేసి సరిపెట్టుకున్నారన్న అబిప్రాయం ఏర్పడుతోంది. ఈ నేపధ్యంలో జెసి జోలికి చంద్రబాబు వెళ్లజాలరని, అలాగే ఆయనకు ఇబ్బంది కలగకుండా కూడా టిడిపి నేతలు ప్రయత్నించవచ్చని కధనాలు వస్తున్నాయి. దీనిపై ఆంగ్ల పత్రికలో రాసిన కదనం ప్రకారం జెసి దివాకరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సభలలో పాల్గొంటూ విపక్ష నేత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.రెడ్లు కూడా చంద్రబాబు కే అనుకూలంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు జెసి పై ఏదైనా చర్య తలపెడితే అది తలనొప్పిగా మారవచ్చని టిడిపి నాయకత్వం భావిస్తోందట. రెడ్డి ఓటర్లలో తప్పు సంకేతం వెళుతుందని భయపడుతున్నారట.అంతేకాక విజయవాడ ఎమ్.పి కేశినేని నాని వ్యవహారంలో సైతం ముఖ్యమంత్రి రాజీ చేశారు తప్ప,వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.అలాగే చింతమనేని ప్రభావకర్ పై ఎన్ని విమర్శలు వస్తున్నా చంద్రబాబు సమర్దిస్తున్నారన్న అబిప్రాయం ఉంది. ఈ నేపద్యంలో ఒక రెడ్డి నేతగా ఉన్న జెసి దివాకరరెడ్డిపై ఏ చర్య తలపెట్టినా అది మరింత ఇబ్బంది అవుతుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.కేంద్ర విమాన శాఖ మంత్రి గా అశోక్ గజపతి రాజు ఉన్నందున ఆయనతో కూడా మేనేజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల జెసి దివాకరరెడ్డిని అన్ని విధాల సేఫ్ చేయడానికి సామాజికవర్గం కోణం కూడా ఉందని ఆంగ్ల పత్రిక విశ్లేషించింది.

tags : jc safe

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info