గతంలో యుపిఎ హయాంలో మంజూరైన ఐటి ఇన్వెస్టెమెంట్ రీజియన్ ( ఐటిఐఆర్ ) ను ప్రస్తుతం ఎన్.డి.ఎ. ప్రభుత్వం వదలివేసినట్లేనా? అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హైదరాబాద్ కు ఈ ఐటి ఐఆర్ మంజూరు చేసింది.దీనితో పెద్ద ఎత్తున ఐటి పెట్టుబడులు వస్తాయని ఆశించారు. కాని ఆ ప్రభుత్వం పడిపోయి బిజెపి ప్రభుత్వం మోడీ ప్రధానిగా ఏర్పడింది. మంత్రి కెటిఆర్ దీనిపై మాట్లాడుతూ ఐటిఐఆర్ కు 3600 కోట్ల రూపాయల నిదులు అవసరం అని అంచనా వేశారని, దీనిపై తాను పలుమార్లు డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు కలిశానని, అయినా ఫలితం దక్కలేదని అన్నారు.అయితే ఐటిఐఆర్ ప్రాజెక్టు తో నిమిత్తం లేకుండా హైదరాబాద్ లో ఐటి పరిశ్రమ వృద్ది చెందుతోందని, అనేక ఐటి పార్కులు వస్తున్నాయని కెటిఆర్ అన్నారు. tags : hyderabad, iitr,