A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో భారీ భూ కుంభకోణం అంటున్న బిజెపి నేత
Share |
August 17 2017, 1:07 pm

విశాఖపట్నంలో మరో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు.మరో పదిహేను రోజులలో దీనిని బహిర్గతం చేస్తానని ఆయన చెప్పారు.ఈ దందాలో ప్రజాప్రతినిదులే నేరుగా పాల్గొన్న ఘట్టాలు ఉన్నాయని ఆయన అన్నారు.పూర్తి సాక్ష్యాలను సేకరిస్తున్నామని, అవి అందగానే మీడియా ముందు ఉంచుతానని విష్ణుకుమార్ రాజు చెప్పారు.ప్రస్తుతం విశాఖ భూమి కుంభకోణంలో సిట్ తో దర్యాప్తు వల్ల మేలు జరుగుతుందని ఎవరూ అనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు .గతంలోనే తాను సిటింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరానని ఆయన గుర్తుచేశారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గదిలో వర్షపునీటి లీకేజీపై సీఐడీ విచారణకు ఆదేశించినంత వేగంగా విశాఖ భూకబ్జాలపై స్పందించివుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. 15వ తేదీన విశాఖలో ప్రజలందరి సమక్షంలో జరగాల్సిన బహిరంగ విచారణను రద్దుచేసి సిట్‌ద్వారా విచారణకు ఆదేశించడాన్ని ఆయన ఆక్షేపించారు.

tags : vishnukumar raju, land scam

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info