A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాలకు టిడిపి అభ్యర్ది ఖరారు
Share |
June 27 2017, 12:25 pm

కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసేందుకుగాను భూమా బ్రహ్మానందరెడ్డిని పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు.దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈయన అన్న కుమారుడు అవుతారు. కర్నూలు జిల్లా నేతలతో సమావేశం అయిన సందర్బంగా ఆయన ఈ ఎంపికను ఖరారు చేశారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడంతో భూమా కుటుంబానికే చంద్రబాబు ఇవ్వవలసి వచ్చింది.భూమా నాగిరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికై, ఆ తర్వాత కాలంలో టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే.

tags : tdp, candidate, nandhayala,ticket

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info