తనకు రాజకీయాలలో జన్మను ఇచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే, రాజకీయ పునర్జన్మను ఇచ్చింది కెసిఆర్ అని మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. తాను టిఆర్ఎస్ ను వదలుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. గిట్టనివారు కొందరు ఇలాంటి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేస్తున్నారని సురేఖ అన్నారు.తాను టిఆర్ఎస్ ను వీడే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.తన రాజకీయ వారసురాలు తన కుమార్తె సుస్మిత పటేల్ అని, ఆమె వచ్చే ఎన్నికలలో పోటీచేసేది ,లేనిది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమెచెప్పారు. tags : kondasurekha, trs, defection, denail