A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మియాపూర్ భూముల స్కామ్ లో ఎపి మంత్రి!
Share |
August 18 2017, 4:36 am

హైదరాబాద్ మియాపూర్ భూముల కుంభకోణంలో ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా పాత్ర ఉందా? ఆయన కూడా అక్కడ భూములు కొన్నారా?బిజెపి నేత రఘునందనరావు చేసిన ఆరోపణ ప్రకారం గంటా మియాపూర్ సర్వే నెంబర్ 77లోని వివాదాస్పద భూమిలో 24.5 ఎకరాల భూమి కొన్నారని ఆయన ఆరోపించారు.వివాదం గొడవగా మారిన తర్వాత ఆయన తెలంగాణకు చెందిన ఒక మంత్రి సాయంతో ఆ భూమి చుట్టూరా పెన్సింగ్ వేయించుకున్నారని రఘునందన్ అంటున్నారు.ఈ విషయం ఆయన మీడియా సమావేశంలో చెప్పినా, ఈ విషయానికి ఆంగ్లపత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయి కాని తెలుగు పత్రికలు పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. విశాఖ భూముల కుంభకోణంలో గంటా ఆరోపణలు ఎదుర్కుంటుండగా, ఇప్పుడు మియాపూర్ భూముల వివాదంలో కూడా గంటా పై విమర్శలు వస్తుండడం విశేషం.కాగా తెలుగుదేశం నేతలు మియాపూర్ భూముల పై సిబిఐ విచారణ కోరుతున్న సంగతి తెలిసిందే.

tags : raghunandan rao, miyapur ,scam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info