A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు బూదాహం పరాకాష్టకు చేరింది
Share |
June 27 2017, 12:25 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ దాహం పరాకాష్టకు చేరిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.పార్దసారధి విమర్శించారు. ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను సమీకరించిన ప్రబుత్వం మళ్లీ పద్నాలుగు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకోవాలని నిర్ణయించడం దారుణంగా ఉందని ఆయన అన్నారు. ఒక వైపు రాజధానిలో హెటళ్లు, విద్యాసంస్థలు వంటివి స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చంద్రబాబు అంటున్నారని, మరో వైపు ఇన్ని వేల ఎకరాలు కొత్తగా తీసుకుంటామని అంటున్నారని పార్ధసారధి విమర్శించారు.వాటిని తమకు కావాలసినవారికి పందారం చేయడానికి సిద్దం అవుతున్నారని ఆయన అన్నారు.ముడుపులు చెల్లించేవారికి ఇలా భూములు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు. రైతలు నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న బూములను ఇష్టారీతిన పంచి, వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మనుమడిని చూడడానికి ప్రత్యేక విమానం లో వెళుతుంటారని, కాని తాను మనుమడిని చూడడానికి కూడా వెళ్లడం లేదని అంటారని ఆయన ద్వజమెత్తారు.

tags : pardhasaradhi, chandrababu, land

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info