A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్య ఈసారి బాణి మార్చారు
Share |
February 22 2017, 9:32 am

కేంద్ర మంత్రి వెంకయ్యన నాయుడు ఈసారి బాణి మార్చారు.ఎపిలో సభ జరిగినప్పుడల్లా మోడీ, బాబు జోడీ అంటూ పొడిగే ఆయన ఈసారి కొత్త పల్లవి కనుగొన్నారు.మమకారం, సహకారం అన్న పదాలను ప్రధానికి, ముఖ్యమంత్రికి ప్రయోగించారు. ప్రదాని మోడీకి ఎపి అంటే మమకారం అని, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం తోడైందని ఆయన అన్నారు. గన్నవరం , రన్ వే విస్తరణ, కొత్త టెర్మినల్ ఏర్పాటు కార్యక్రమాల సందర్భంగా ప్రసంగించినప్పుడు ఆయన ఈ కొత్త స్లోగన్ ఖాయం చేశారు. ఇంతకాలం ప్రధాని మోడీతో సమానం చేసి చంద్రబాబును పొగుడుతున్నారన్న విమర్శ నేపధ్యంలో వెంకయ్య నాయుడు తన పదబంధాన్ని మార్చారని అనుకోవాలి. మంచి పనిచేస్తున్న వాళ్లను ప్రోత్సహించాలని, వారిని ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు. బహుశా చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఇదే మాట చెబుతున్నందున వెంకయ్య కూడా శృతి కలిపారని అనుకోవచ్చేమో!

tags : venkayya, slogan, chandge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info