A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు సభకు విపక్ష ఎమ్.పి వెళ్లకూడదా
Share |
January 21 2017, 4:08 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు ఒక విపక్ష ఎమ్.పి వెళ్లాలంటే ఇన్ని పాట్లు పడాలా?ఎందుకు ఇలా జరుగుతోంది.కడప జిల్లా గండికోట ప్రాజెక్టు ప్రారంబోత్సవ సభకు కడప ఎమ.పి వై ఎస్ అవినాశ్ రెడ్డి ని, మాజీ మంత్రి వివేకానందరెడ్డిని పోలీసులు అడ్డుకున్న తీరు విమర్శలకు గురి చేస్తోంది.ఇది పోలీసుల ఓవర్ యాక్షనా, లేక ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలా అన్నది తెలయిదుకాని జరిగింది మాత్రం బాగోలేదు. మీడియాల వచ్చిన కధనాల ప్రకారం సింహాద్రిపురం మండలం పైడిపాలెం వద్ద జరిగే జన్మభూమి సభకు వీరిని వెళ్లకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.ఉదయం నుంచి వీరి ఇళ్ల వద్ద పోలీసుల పహారా పెట్టారు.పోలీసులతో తోపులాటల మద్య అవినాశ్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని కోవరంగుంటపల్లెలోని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అక్కడినుంచి పైడిపాలెం వెళుతున్న ఎంపీని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆయన బలవంతంగా పైడిపాలెం ప్రాజెక్టు జన్మభూమి కార్యక్రమానికి వెళ్లారు.వెళ్లిన తర్వాత ఆయన ఎక్కడా అభ్యంతరకరంగా కాని,ప్రభుత్వంపై విమర్శలు కాని చేయలేదు. గండికోట ప్రాజెక్టుకు 660 కోట్ల రూపాయలను వైఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పారు.ఆ తర్వాత కొద్ది సేపటికి ఆయన మైక్ అవడం విశేషం.

tags : ys avinashreddy, chandrababu, cm,meeting

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info