A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి అంత అబివృద్ది చెందిందా..నమ్మవచ్చా!
Share |
March 25 2017, 7:21 am

ఎపి ప్రభుత్వ పెద్దలు చెప్పే విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 12.3 శాతం వృద్ది రేటు నమోదు అయిందని ,తృతియార్దంలో అది 15 శాతం అవుతుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.వర్షపాతంలో లోటు ఉన్నా, వ్యవసాయ రంగం లో 25 శాతం వృద్ది సాధించామని ఆయన అంటున్నారు.ఖరీఫ్ లో గత ఏడాది 69 లక్షల టన్నుల వరి పండితే. ఈ ఖరీఫ్ లో డెబ్బైరెండు లక్షల టన్నులు పండిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో లక్షన్నర ఎకరాల మేర సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని కూడా ఆయన తెలిపారు.కాగా కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు రావాలని, ఇందులో ఏడువే ల కోట్లను పంటల నష్టం కూడా తక్కువగా ఉంది’’ అని వివరించారు. ద్రవ్యోల్బణం దేశం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నామని ఆయనత ఎలిపారు. ఒకవైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులలో ఉందని మంత్రులు, ముఖ్యమంత్రే చెబుతారు.మరో వైపుఎంతో అభివృద్ది సాధించేశామని వారే చెబుతారు. ఏది నమ్మాలి.

tags : yanamala, growth rate

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info