A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి దివాకరరెడ్డి విమర్శలలో ఆంతర్యం
Share |
March 25 2017, 7:21 am

అనంతపురం టిడిపి ఎమ.పి జెసి దివాకరరెడ్డి ఇటీవలి కాలంలో విపక్ష నేత జగన్ పై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారన్నది చర్చనీయాంశమే.ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుకోలు కోసం ఆయనను పొగడడం ఒక కోణం అయితే,జగన్ ను పనికట్టుకుని విమర్శించడం కూడా చంద్రబాబు వద్ద పర్టిఫికెట్ పొందడంతో పాటు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.తాడిపత్రికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఇన్ చార్జీగా పెట్టిన వ్యక్తి నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారని ,అది జెసి సోదరులకు కాస్త చికాకుగా మారిందని చెబుతున్నారు.ఇంతకాలం తమకు ఎదురులేని విధంగా ఉన్న తాడిపత్రిలో ఒక గట్టి ప్రత్యర్ధి తయారు కావడం ఆయనకు సహజంగానే ఇష్టం ఉండదు.ఇది కూడా కారణం కావచ్చని అంటున్నారు. ఏడో తరగతి ఫెయిల్‌ అయినవారిని వైకాపా తాడిపత్రి ఇన్‌ఛార్జిగా పెట్టారని తీవ్రంగా ఆరోపించారు.కాగా తాను బూట్లు నాకేవాడినైతే, ఎప్పుడో మంత్రి అయ్యేవాడినని జెసి అన్నారు. అంటే దానర్దం ఏమిటో జెసినే చెప్పవలసి ఉంటుంది.

tags : jc, jagan, tadipatri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info