A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికలలో ఖర్చు చేయనని బాబు చెప్పగలరా
Share |
February 22 2017, 9:31 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టిడిపిలోకి తీసుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయడు ఈ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి,ఆ ఉప ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయకుండా ఉంటానని చెప్పగలరా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని ముప్పై కోట్ల కు కొనుగోలు చేసిన చంద్రబాబు , చాలా నీతిమంతుడున్నట్లుగా కబుర్లు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని ఆమె అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే తమ పార్టీ కచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టకుండా గెలుస్తామని సవాల్ చేస్తున్నామని అన్నారు. అందుకు చంద్రబాబు సిద్దపడగలరా అని ఆమె అన్నారు.చంద్రబాబు తన రెండు ఎకరాల ఆస్తి నుంచి కోట్ల రూపాయల ఆస్తికి ఎగబాకడంలో రహస్యం వివరించగలరా అని పద్మ ప్రశ్నించారు.

tags : vasireddy padma, elections,expenditure, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info