A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవుడిని కోరుకుందాం అంటున్న జగన్
Share |
February 22 2017, 9:32 am

ఎపిలో ప్రజాకంటకంగా మారిన చంద్రబాబు ప్రభుత్వం పోవాలని దేవుడిని గట్టిగా కోరుకుందాం అన విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు.కర్నూలు జిల్లాలో ఆయన రైతు భరోసా యాత్ర కొనసాగించారు.ఆయా వర్గాల ప్రజలు తమ బాదలు వివరించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు.కొందరు తమకు ఇళ్లు లేవని, మరికొందరు ఇంకా ఫించన్లు ఇవ్వడం లేదని ఆయనకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క మేలు చేయడం లేదని, ఆయనది మొదటి నుంచీ అదే తీరని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రధానంగా వృద్ధులకు పింఛన్లను కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు.తాము నారు పోసుకున్న తర్వాత నీరు ఇవ్వబోమంటూ ప్రభుత్వం దండోరా వేస్తోందని రైతులు వాపోయారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ రెండో కారు పంటకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్‌ జగన్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మూడో కారు పంటకు నీరిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వస్తోంది.. ప్రజలకు ఒక్క మేలూ చేయని చంద్రబాబు ప్రభుత్వం పోవాలని గట్టిగా దేవుడిని కోరుకోవాలని ప్రజలతో జగన్ అన్నారు.

tags : jagan, god, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info