A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆయన జగన్ చేతిలో శిఖండి అన్న మంత్రులు
Share |
March 25 2017, 7:18 am

విపక్ష నేత జగన్ చేతిలో కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శఖండిగా మారారని ఎపి మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ,మృణాళిని విమర్శించారు.జగన్ చేతిలో ముద్రగడ ఉన్నారని కాపు సామాజికవర్గం అంతా బావిస్తోందని, దీనివల్ల కాపు సామాజికవర్గానికి నష్టం కలిగిస్తుందని వారు అన్నారు.సామాజికవర్గం మేలు కోసం పోరాడేవారు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి సామాజిక వర్గాన్ని వేదికగా చేసుకోరని వారు పేర్కొన్నారు.ముద్రగడ ఉద్యమం లక్ష్యాన్ని పక్కదారి పట్టి, వ్యక్తిగత కక్షగా మారిందన్న విషయాన్ని కాపులు గుర్తించారని వారు చెప్పారు.కాపుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనునిత్యం కృషి చేస్తుంటే, ముద్రగడ విపక్ష నేత జగన్ కు లబ్ది చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

tags : tdp, jagan, kapu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info