A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీలో కొత్త నకిలీ నోట్లు దొరికాయి
Share |
March 25 2017, 7:19 am

పాకిస్తాన్ లో భారత కరెన్సీకి నకిలీలు తయారు చేస్తున్నారని , నోట్ల రద్దుకు అది కూడా ఒక కారణమని కేంద్రం చెబుతుంటుంది. పాకిస్తాన్ లో సంగతి ఏమో కాని,మన దేశంలో కొందరు కొత్త నోట్లకు నకిలీవి ముద్రిస్తున్నారు.కొద్దికాలం క్రితం చండీగడ్ లో ఒక వ్యక్తి పట్టుబడగా , తాజాగా డిల్లీలో ఆరు లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని కొందరు ముద్రించి పంపిణీ చేస్తూ పట్టుబడడ్డారు.డిల్లీలో మంగళవారం దయం ఒక ముఠానుపోలీసులు పట్టుకోగా,వారి వద్ద నకిలీ నోట్లు దొరికాయి. వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, బ్యాగులు పరిశీలించగా భారీగా కొత్త నోట్లు కనిపించాయి. వాటిని తనిఖీ చేస్తే అవన్ని నకిలీ నోట్లు అని తేలింది.దాంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోకి వచ్చిన రెండువేల రూపాయలు,ఐదువందల రూపాయల కరెన్సీకి అప్పుడే నకీలీలు రెడీ అవడం సీరియస్ విషయమే.

tags : delhi, fake currency

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info