A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐఐటి విద్యార్దులతో మంత్రి కెటిఆర్ -స్పీచ్
Share |
January 21 2017, 10:57 pm

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఐఐటి మద్రాస్ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇన్నోవేట్, ఇంక్యూబేట్ అండ్ ఇన్ కార్పేట్ – దేశంలో స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ అభివృద్ది అనే అంశం పైన మంత్రి మట్లాడారు. ఐఐటి మద్రాస్ ప్రతి ఏడాది దేశ విధేశాల్లోని ప్రముఖులను అహ్వనిస్తుంది. ఈ సంవత్సరం మంత్రి కెటి రామారావును ఈ ఉపన్యాసానికి అహ్వనించింది. దేశంలో స్టార్ట్ అప్ బలోపేతం అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. విద్యార్దుల్లోని జౌత్సాహిక, అలోచనలకు అండగా నిలబడ్డప్పుడే దేశంలో స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ అభివృద్ది చెందుతుందని మంత్రి కెటియార్ తెలిపారు. ఐఐటిలాంటి ఉన్నత ప్రమాణాలున్న
విద్యాసంస్ధలు పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వాలని, ఈ దిశగా ప్రభుత్వాలు కొత్త తరం అలోచనలతో పాలసీలు తయారుచేయాలని మంత్రి అన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం టి హబ్ లాంటి సంస్ధలను ఏర్పాటు చేసిందన్నారు. పరిశోధనలకు ప్రత్యేకంగా ప్రభుత్వం పాలసీలను తయారు చేసిందన్నారు. ప్రభుత్వం యువశక్తిని గుర్తిస్తూ, కొత్త భారతాన్ని నిర్మించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలన్నారు. దేశంలోని యువత పరిశోదనల వైపు మళ్లినప్పుడే ఫేస్ బుక్, టెస్లా లాంటి వినూత్నమైన
అవిష్కారణలు భారతదేశంలోనూ సాద్యం అవుతాయన్నారు. దేశంలోని యువకులకు స్టాప్ట్ వేర్ రంగంలో విస్తృతమైన టాలెంట్ ఉందని, ఈ టాంలెట్ ను స్టార్ట్ అప్ రంగంతో సమ్మిళితం చేయాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన టి హబ్ కానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే టి వర్క్స్ లాంటి కార్యక్రమాలను దేశంలోని ప్రతి ఒక్క యువకుడు, విద్యార్ది అయినా ఉపయోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. టి హబ్ ద్వారా దేశంలోని స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. టిహబ్ ఏలా పనిచేస్తుంది, స్టార్ట్ అప్ ఈ కో సిస్టమ్ అది అందించే సహాకారం, టి బ్రిడ్జ్ ద్వారా దేశంలోని పరిశోధనలకు సిలికాన్ వ్యాలీ లోని ఈ కో సిస్టమ్ సహాకారం ఏలా అందించేది మంత్రి వివరించారు. మద్రాస్ ఐఐటి సందర్శన తర్వతా, విద్యార్దుల అలోచనల మేరకు దేశంలోని ఐఐటి లాంటి అత్యున్నత విద్యా సంస్ధలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. మంత్రి తన ప్రసంగం తర్వతా విద్యార్దులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ప్రభుత్వ పాలన, తాను నిర్వహిస్తున్న వివిధ శాఖల మద్య సమన్వయంతో చేసుకుంటూ ఐటిలాంటి అంశాలను ఏలా అద్యాయనం చేస్తున్నారంటూ మంత్రిని అడిగారు. విద్యార్దులైన,యువకులైనా, తనలాగా రాజకీయ నాయకులెవర్ని అయినా నడిపించేది జ్జానతృష్టే అని అన్నారు. అయితే మీలాగా సమయం దొరకడం లేదన్నారు. తెలంగాణలో చేపట్టిన హ్యండ్ లూమ్ మండే కార్యక్రమం గురించి వివరించారు. ఉదయం నుంచి ప్రతి సోమవారంలాగానే ఈ రోజు చేనేత వస్ర్తాలు ధరించి పలు కార్యక్రమాలు హజరయ్యనన్నారు. అయితే యువకుల ముందుకు వస్తున్నందున మీలాగే టి షర్ట్ వేసుకుని వచ్చానని, నేనేకూడా యువకున్నే అంటూ నవ్వులు పూయించారు.ఈ కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామూర్తి, పరిశ్రమలు, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ లు
పాల్గోన్నారు.

tags : ktr, iit,studens

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*జల్లికట్టుతోనే దేశ సమగ్రత లింకా:
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info