AP Political website
 
 
 
తిరుపతిలో వంటావార్పు
Share |

తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుంటే.. సమైక్యాంధ్ర కోసం తామేం తక్కువ కాదంటున్నారు సీమాంధ్ర వాసులు. ఇప్పటికే ర్యాలీలు.. ఆందోళనలతో సీమాంధ్ర అట్టుడుకుతుంటే.. ఈ సారి ఏకంగా తిరుపతిలో తెలంగాణ స్టైల్లో వంటావార్పును నిర్వహిస్తున్నారు. ఆ మధ్య గుంటూరులో నిర్వహించినట్లు మాదిరిగానే.. ఈ సారి తిరుపతిలో వంటావార్పును సమైక్యాంధ్ర జేఏసీ నిర్వహిస్తోంది. ఇక విశాఖలో సమైక్యాంధ్ర కావాలంటూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష మొదలు పెట్టారు. సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా.. ఈ దీక్ష చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం.. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని కూడా సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఇదే కాకుండా.. సీమాంధ్ర వ్యాప్తంగా.. చాలా చోట్ల రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ.. అనేక ర్యాలీలు.. నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

 
 
 
 
For Advertising on this site contact

ads.ksrsite@gmail.com

8th Chapter - SKC Report

Chapter Details

రాష్ట్రంలో వచ్చే నెలలో జరగబోతున్న ఉప ఎన్నికలు అందరికి ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి తన భవిష్యత్తు ఏమిటో సంకేతాన్ని ఈ ఎన్నిక తెలియచెప్పబోతోంది. ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కోలుకునే అవకాశం ఉందో కూడా ఈ ఉప ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్యేనని చెప్పాలి.ప్రధానంగా కోస్తా, రాయలసీమలకు చెందిన నియోజకవర్గాలలో జరిగే ఉప ఎన్నికలు రాష్ట్రంలో జరిగే భవిష్యత్తు పరిణామాలకు దిక్సూచి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.అదే సమయంలో తెలంగాణ లో జరగనున్న పరకాల ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల ఆధిపత్య పోరుకు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఉనికికి ఒక పరీక్షగా తీసుకోవచ్చు.

 

రాష్ట్రం రెండు నివేదికల కారణంగా రావణాకాష్టంగా మారినట్లు అర్ధమవుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం రెండువేల తొమ్మిది డిసెంబరు పందొమ్మిదో తేదీన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య రాసిన ఒక నివేదిక కారణంగా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనను మార్చుకుని డిసెంబరు ఇరవైమూడో తేదీన మరో ప్రకటన చేసిందన్నది ఆ కధన సారాంశం.కేంద్ర హోం మంత్రి చిదంబరానికి రోశయ్య ఒక నివేదిక పంపుతూఆంద్ర,రాయలసీమ ప్రాంతాలలో చిదంబరం ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని తెలిపారు. 2.25లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారని, ఆంధ్ర,రాయలసీమలలో 1141 ఆందోళనలు జరిగాయని, వీటిలో ర్యాఈలు,ధర్నాలు,ఆమరణ నిరాహార దీక్షలు,రైల్ రకోలు, రాస్తారొకో తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.

 
   
     

 
 
copyright © 2011 www.kommineni.info