AP Political website
 
 
BREAKING NEWS:రోడ్డు ప్రమాదంలో కర్నాటక జడ్జి గోవిందరాజులు మరణం BREAKING NEWS:టిటిడి ఇఓ ఎల్.వి.సుబ్రహ్మణ్యం బదిలీ-ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చే అవకాశం BREAKING NEWS: నెల్లూరులో కాంగ్రెస్ అభ్యర్ది సుబ్బరామిరెడ్డికి మద్దతుగా చిరంజీవి విస్తృత ప్రచారంBREAKING NEWS:తెలంగాణపై రాజ్యసభలో వి.హనుమంతరావు, దేవేందర్ గౌడ్ ల వాగ్వాదం BREAKING NEWS:తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా మంత్రి గల్లా అరుణ ప్రచారంBREAKING NEWS:వై.ఎస్.లేని లోటును భర్తీ చేసుకుంటాం- కేంద్ర మంత్రి వాయలార్ రవిBREAKING NEWS: తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టుకు తెలిపిన నిమ్మగడ్డ ప్రసాద్BREAKING NEWS:పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయి-నిమ్మగడ్డ ప్రసాద్ హెచ్చరిక BREAKING NEWS: వాన్ పిక్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్BREAKING NEWS: జగన్ ఆస్తుల కేసులో సాక్షి మీడియా ఆస్తుల జప్తుకు సిబిఐ కి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంBREAKING NEWS:ఎమ్.ఆర్.కేసులో కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డిల ఆస్తుల జప్తుకు సిబిఐకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం BREAKING NEWS: జగన్ ఆస్తుల కేసులో ప్రబుత్వ అదికారి బ్రహ్మానందరెడ్డిని కూడా నిందితుడిగా చేస్తూ కోర్టులో మెమో దాఖలు చేసిన సిబిఐBREAKING NEWS:కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఇంటిలో సోదాలు జరిపిన సిబిఐBREAKING NEWS: టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాకు బెయిల్ మంజూరు చేసిన పాటియాల కోర్టుBREAKING NEWS:పదిహేను నెలలుగా జైలులో ఉన్న రాజా కు ఎట్టకేలకు బెయిల్, కోర్టు అనుమతి లేకుండా తమిళనాడుకు వెళ్లరాదని ఆంక్షలు BREAKING NEWS:మియాపూర్ కోర్టులో మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ ను ప్రవేశపెట్టిన పోలీసులుBREAKING NEWS:జగన్ కేసులో ఛార్జీషీటు, తదితర డాక్యుమెంట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పిన సిబిఐBREAKING NEWS:
తాజా వార్తా విశ్లేషణలు
 
 
More News from Archives
 
   

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక,టివీ ఛానల్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ సిబిఐ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనదే.దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన సన్నివేశం. అత్యవసర పరిస్థితిలో సైతం ఇలా చేయలేదని జగన్ విమర్శించినా, జగన్ కంపెనీలలో అన్నీ అవినీతి సంపాదనతో వచ్చిన పెట్టుబడులేనని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినా, దీనికి రాజకీయాలకు సంబంధం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినా మొత్తం ఈ ఉదంతంలో ఏదో జరుగుతోందన్న భావన కలుగుతుంది. జగన్ ఆస్తుల కేసు విచారణకు తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు వాటికి ఆధారంగా కనిపిస్తాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో నేర పరిశోధన వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. మన చట్టంలో దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో అధికారాలు ఉన్నాయి. అయితే వాటిని విచక్షణతో వాడుకోవాలి. దుర్వినియోగం అవుతున్నాయన్న అభిప్రాయం కలిగితే మొత్తం సంస్థ విశ్వసనీయతకు దెబ్బ తగులుతుంది. అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ నడుస్తోందన్న అభిప్రాయానికి సిబిఐ ఆస్కారం ఇవ్వరాదు. నిజానికి మన రాష్ట్రంలో సిబిఐ తరపున పనిచేస్తున్న అధికారి లక్ష్మీనారాయణ నిజాయితీ పరుడిగా, నిర్మొహమాటిగా గుర్తింపు పొందారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు మంచి పేరు వచ్చింది. కాని జగన్ ఆస్తుల కేసు వచ్చేసరికి ఆయనపై కూడా కొందరు విమర్శలు చేసే పరిస్థితి రావడం కొంచెం బాధాకరమే.

 
 
 
 
For Advertising on this site contact

ads.ksrsite@gmail.com

8th Chapter - SKC Report

Chapter Details

రాష్ట్రంలో వచ్చే నెలలో జరగబోతున్న ఉప ఎన్నికలు అందరికి ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి తన భవిష్యత్తు ఏమిటో సంకేతాన్ని ఈ ఎన్నిక తెలియచెప్పబోతోంది. ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కోలుకునే అవకాశం ఉందో కూడా ఈ ఉప ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్యేనని చెప్పాలి.ప్రధానంగా కోస్తా, రాయలసీమలకు చెందిన నియోజకవర్గాలలో జరిగే ఉప ఎన్నికలు రాష్ట్రంలో జరిగే భవిష్యత్తు పరిణామాలకు దిక్సూచి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.అదే సమయంలో తెలంగాణ లో జరగనున్న పరకాల ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల ఆధిపత్య పోరుకు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఉనికికి ఒక పరీక్షగా తీసుకోవచ్చు.

 

రాష్ట్రం రెండు నివేదికల కారణంగా రావణాకాష్టంగా మారినట్లు అర్ధమవుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం రెండువేల తొమ్మిది డిసెంబరు పందొమ్మిదో తేదీన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య రాసిన ఒక నివేదిక కారణంగా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనను మార్చుకుని డిసెంబరు ఇరవైమూడో తేదీన మరో ప్రకటన చేసిందన్నది ఆ కధన సారాంశం.కేంద్ర హోం మంత్రి చిదంబరానికి రోశయ్య ఒక నివేదిక పంపుతూఆంద్ర,రాయలసీమ ప్రాంతాలలో చిదంబరం ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని తెలిపారు. 2.25లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారని, ఆంధ్ర,రాయలసీమలలో 1141 ఆందోళనలు జరిగాయని, వీటిలో ర్యాఈలు,ధర్నాలు,ఆమరణ నిరాహార దీక్షలు,రైల్ రకోలు, రాస్తారొకో తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.

 

 
 
copyright © 2011 www.kommineni.info